Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది ?

| Edited By: Team Veegam

Apr 04, 2021 | 9:07 PM

ఆయనతో జతకడితే కలిసొస్తుందనుకుంటే... సీన్ ఇలా రివర్స్ అయిందేమిటి ? సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్ తగలడం వెనుక అసలు ఏం జరిగింది ?

Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది ?
Janasena Symbol Bjp Symbol
Follow us on

తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్ తగిలింది. సింబల్ విషయంలో ఈ సమస్య ఎదురవడంతో అటు జనసేన, ఇటు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ అభ్యర్దిగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు రత్నప్రభ. ఆమెకు జనసేన మద్దతిచ్చింది.

తమ్ముడు పవన్ కల్యాణ్‌ మైత్రి కలిసొస్తుందని భావించింది బీజేపీ. కాని జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాస్‌ రూపంలో సీన్ రివర్స్ అయింది. ఆ సింబల్‌ని నవతరం పార్టీ అభ్యర్ధి గోదా రమేష్‌కుమార్‌కు కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే దీనిపై బీజేపీ భగ్గుమంటోంది. ఇది ఖచ్చితంగా వైసీపీ రాజకీయ ఎత్తుగడేనన్నారు ఆపార్టీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిని ఎదుర్కొనలేకే బినామీలతో నామినేషన్లు వేయించి…జనసేన గుర్తుని చేజిక్కించుకున్నారని విమర్శించారాయన.

ఈ సింబల్ పాలిటిక్స్‌పై స్పందించారు నవతరం పార్టీ అభ్యర్ధి రమేష్‌కుమార్. తాను పవన్ కల్యాణ్ అభిమానినని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. నవతరం పార్టీ అభ్యర్ధి రమేష్‌కుమార్. తాన వెనుక ఎవరూ లేరని స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్నానన్నారు.

అయితే జనసేన పార్టీ గుర్తును స్వతంత్య అభ్యర్ధికి ఎలా కేటాయించారన్న దానిపై కూడా క్లారిటీ ఉంది. 2019ఎన్నికల్లో జనసేన… BSP, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును తాత్కాలికంగా జనసేనకు కేటాయించింది.

అప్పుడు పోలైన ఓట్లలో కనీసం 6శాతం కూడా జనసేనకు పడలేదు. ఆ కారణంగా జనసేనకు ఈసీ రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కలేదు. అంతే కాదు ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంతో గాజు గ్లాస్‌ గుర్తును నవతరం పార్టీ అభ్యర్ధికి కేటాయించింది ఈసీ.

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందని పక్షంలో తాత్కాలిక సింబల్‌ని స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించే అధికారం ఈసీకి, రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. అందులో భాగంగానే నవరత్నం పార్టీ అభ్యర్ధి రమేష్‌కి జనసేన గుర్తుగా ఉన్నటువంటి గాజు గ్లాస్ సింబల్‌ని కేటాయించింది.

సిస్ట్యూవేషన్ ఏదైనా ..సింబల్ ఇప్పుడు బీజేపీ, జనసేనకు పెద్ద సమస్యగా మారింది. ‌బ్యాలెట్‌ పేపర్‌లో గాజు గ్లాస్ గుర్తు చూసి జనసేన అభిమానుల ఓట్లు చేజారిపోయే ఛాన్సుందనే గుబులు మొదలైంది.

ఇవి కూడా చదవండి: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!