అసలు పురాణాల్లో ‘హిందూ’ అనే పదమే లేదు..!

కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పురాణాల్లో హిందూ అన్న పదమే లేదన్నారు కమల్ హాసన్. భారత్‌పై దండెత్తిన విదేశీయులే హిందూ అన్న పదాన్ని తీసుకొచ్చారని అన్నారు. హిందూ అనే పదం కంటే మనమంతా భారతీయులమని పిల్చుకోవాలన్నారు కమల్. స్వాతంత్ర్య భారతంలో తొలి టెర్రరిస్ట్ హిందువే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రగడ రాజుకుంది. పలు హిందూ సంఘాలు కమల్‌పై కేసులు పెట్టాయి. బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి […]

అసలు పురాణాల్లో హిందూ అనే పదమే లేదు..!

Edited By:

Updated on: May 18, 2019 | 1:23 PM

కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పురాణాల్లో హిందూ అన్న పదమే లేదన్నారు కమల్ హాసన్. భారత్‌పై దండెత్తిన విదేశీయులే హిందూ అన్న పదాన్ని తీసుకొచ్చారని అన్నారు. హిందూ అనే పదం కంటే మనమంతా భారతీయులమని పిల్చుకోవాలన్నారు కమల్.

స్వాతంత్ర్య భారతంలో తొలి టెర్రరిస్ట్ హిందువే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రగడ రాజుకుంది. పలు హిందూ సంఘాలు కమల్‌పై కేసులు పెట్టాయి. బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలపై ఈసీ కమల్‌ను వివరణ కూడా కోరింది. కాగా.. కరూర్‌లో జరిగిన సభలో కమల్‌పైకి రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరిన వ్యక్తిని ఎంఎన్ఎం కార్యకర్తలు చితకబాదారు.