మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీలకు మించిన ఫలితాలు ఖాయం.. ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్న ధర్మాన
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసి, మున్సిపల్ ఎన్నికలకు తెరలేచింది. మొత్తం నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసి, మున్సిపల్ ఎన్నికలకు తెరలేచింది. మొత్తం నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే పునరావృతం అవుతాయని అధికార పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎన్నో వివాదాలు అధిగమించి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఇక మున్సిపల్ ఎన్నికలను సైతం విజయవంతంగా పూర్తి చేయడానికి ఎస్‌ఈసీ కసరత్తు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక మున్సిపాల్టీలో వైసీపీ జెండానె ఎగరవేసేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు అత్యధిక మున్సిపాల్టీలను కైవసం చేసుకుంటుందిన ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత 20 నెలల్లో ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న పథకాలే పంచాయితీల్లో వైకాపా మద్దతుదారుల విజయానికి కారణమయ్యాయని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మున్సి పోల్స్ లోనూ పంచాయతీలకు మించిన ఫలితాలు సాధిస్తామన్నరు. ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తాయని వివరించారు. . సంక్షేమం అంటే ఎలా ఉంటుందో జగన్ చేసి చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కి మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. .
టీడీపీ హయాంలో ప్రజాసంక్షేమం అటకెక్కిందని ధర్మాన విమర్శించారు. . ప్రజలు ఇప్పుడు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరని అన్నారు. తిరుపతి విమానాశ్రయం లో చంద్రబాబు నిరసన డ్రామాని చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. ఎన్ని డ్రామాలు వేసినా మసి పూసి మారేడు కాయ చేయలేరని మంత్రి మండిపడ్డారు. జగన్ మంత్రి వర్గంలో పనిచేయడం గొప్ప వరంగా ధర్మాన పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రిగా అర్హులకు ఇండ్ల పట్టాలు, అలాగే శాశ్వత భూ హక్కు పథకం అమలు చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా ధర్మాన కృష్ణదాస్ చెప్పారు.
అమరావతి రైతుల దీక్షలు చంద్రబాబు పుణ్యమేనని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును మేము గౌరవిస్తాం. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు నిలిపివేస్తున్నామనడం అవాస్తవంమని చెప్పారు. అర్హులు అయితే చాలు పార్టీతో మాకు సంబంధం లేదు. అలాంటి సంఘటన ఎక్కడ కనిపించినా మాకు నిర్భయంగా చెప్పవచ్చని ధర్మాన కృష్ణాదాస్ చెప్పారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. గతేడాది మార్చి 15న నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రకటించారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు మార్చి 8న సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు:
విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు:
శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ విజయనగరం జిల్లా: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల విశాఖ జిల్లా: నర్సీపట్నం, యలమంచిలి
తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం కృష్ణా జిల్లా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు గుంటూరు జిల్లా: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల ప్రకాశం జిల్లా: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు(N), సూళ్లూరుపేట, నాయుడుపేట
అనంతపురం జిల్లా: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి అనంతపురం జిల్లా: రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర కర్నూల్ జిల్లా: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ కర్నూల్ జిల్లా: నందికొట్కూరు, గూడూరు(K), ఆత్మకూరు(K)
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల చిత్తూరు జిల్లా: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు
Read more:
మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు