Gangula Kamalakar : ఏడేళ్లు మంత్రి పదవులు వెలగబెట్టినా చేయనిది.. ఈటల ఇప్పుడెలా చేస్తారు : మంత్రి గంగుల

సిరిసిల్ల, వరంగల్​, కరీంనగర్​ మాదిరిగానే జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు..

Gangula Kamalakar : ఏడేళ్లు మంత్రి పదవులు వెలగబెట్టినా చేయనిది.. ఈటల ఇప్పుడెలా చేస్తారు : మంత్రి గంగుల
Gangula

Updated on: Jun 29, 2021 | 11:46 PM

Gangula on Etela : ఏడేళ్ల అధికారంలో నియోజకవర్గానికి ఈటల రాజేందర్​ చేసింది ఏమీ లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ విమర్శించారు. సుధీర్ఘ కాలంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తన సొంత పనుల కోసమే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేవారు తప్ప.. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను ఎన్నడూ అడగలేదన్నారు. అయితే తామంతా నియోజకవర్గ పరిస్థితిని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే రూ. 31 కోట్లు మంజూరు చేశారని… సిరిసిల్ల, వరంగల్​, కరీంనగర్​ మాదిరిగానే జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోనే విద్యుత్​ను ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి గంగుల అన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి పాల్గొన్నారు. జమ్మికుంటలో రోడ్లన్నీ దుర్భరంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఈ ఏడేళ్లలో ఏం అభివృద్ధి చేశారు. ఈటల రాజేందర్​ను రెండోసారి గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని అడిగి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలి కదా.. రెండు సార్లు మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆలోచించాలన్నారు గంగుల కమలాకర్​,

ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధిదేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. పింఛన్​, కల్యాణ లక్ష్మి, రైతుబంధు సహా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

Read also : Seethakka : వంద కార్లతో ర్యాలీ తీసిన సీతక్క.. అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని వ్యాఖ్య, రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు