ఢిల్లీ: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి తనను డిప్యుటేషన్‌పై పంపాలని గత కొంతకాలం నుంచి శ్రీలక్షీ కోరుతున్న విషయం తెలిసిందే. బదిలీ కోసం గతంలోనే ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ విషయంలో కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆవిడ పార్లమెంట్ ఆవరణలో విజయసాయి రెడ్డిని అప్రోచ్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఆమెను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిపించి పరిస్థితి వివరించారు. వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న సాయి రెడ్డి ఈ ఇష్యూని త్వరలోనే సార్టవుట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.