జగ్గారెడ్డి(Jagga reddy) కాంగ్రెస్ (Congress)లో ఉంటారా లేదా? రాజీనామా విషయంలో వెనక్కి తగ్గాలన్న సీఎల్పీ( CLP) విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటారా? శుక్రవారం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఏం తేలుస్తారా? సీనియర్ లీడర్ జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ గాంధీలకు లేఖలు రాసిన జగ్గారెడ్డి.. శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే సీఎల్పీ ఆఫీసులో భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్యేలు తాజా పరిణామాలపై చర్చించారు. ఈ మీటింగ్‌గు జగ్గారెడ్డి కూడా వచ్చారు. సుదీర్ఘంగా చర్చించిన నేతలు రాజీనామా విషయంలో తగ్గాలని జగ్గారెడ్డిని కోరినట్లు తెలుస్తోంది.
హైకమాండ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలతో పాటు బహిరంగంగా చెప్పలేని మరిన్ని ఇష్యూస్‌ని CLP మీటింగ్‌లో వెల్లడించారట జగ్గారెడ్డి. ముఖ్యంగా కొందరు పార్టీ నేతలే కోవర్ట్ ముద్ర వేస్తూ..సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారట. ఇక పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను జాతీయ నాయకత్వానికి స్వయంగా వివరిస్తానని చెప్పారట జగ్గారెడ్డి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ అపాయిట్మెంట్ ఇచ్చేలా చొరవ చూపాలని భట్టి విక్రమార్కను కోరారని తెలుస్తోంది.
అటు కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి CLP మీటింగ్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. జగ్గారెడ్డి రాజీనామా చేయరనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను కూడా పార్టీని వీడుతానని చెప్పానని.. కానీ వెళ్లలేదు కదా.. అలాగే జగ్గారెడ్డి కూడా ఉంటారని వ్యాఖ్యానించారు రాజగోపాల్‌రెడ్డి.
అటు కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి CLP మీటింగ్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. జగ్గారెడ్డి రాజీనామా చేయరనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను కూడా పార్టీని వీడుతానని చెప్పానని.. కానీ వెళ్లలేదు కదా.. అలాగే జగ్గారెడ్డి కూడా ఉంటారని వ్యాఖ్యనించారు రాజగోపాల్‌రెడ్డి…
ఇక ఇవన్నీ పక్కన పెడితే రేపు సంగారెడ్డిలో యధావిధిగా పార్టీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు జగ్గారెడ్డి. కార్యకర్తల ఆలోచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. అయితే ఈ మీటింగ్‌కు రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మీటింగ్ లు కామన్ అంటున్నారు నేతలు. మొత్తానికి జగ్గారెడ్డి పార్టీని వీడరని సహాచర ఎమ్మెల్యేలు చెబుతున్నా.. రేపటి మీటింగ్‌తో ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ఉక్రెయిన్ విషయంలో పుతిన్‌కు పూనకమెందుకు? ఇంతకీ రష్యా డిమాండ్లు ఏంటి?