‘తేడాలుంటే వీవీప్యాట్‌ ఫలితాలే ఫైనల్‌’: రజత్‌కుమార్‌

| Edited By:

May 09, 2019 | 9:44 PM

ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రంలోని 17 మంది రిటర్నింగ్ అధికారులు, 119 మంది సహాయ రిటర్నింగ్ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో నమూనా లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్‌లాల్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఐదు చొప్పున వీవీప్యాట్ యంత్రాలను లెక్కించే విధానం తదితర అంశాలపై […]

‘తేడాలుంటే వీవీప్యాట్‌ ఫలితాలే ఫైనల్‌: రజత్‌కుమార్‌
Follow us on

ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రంలోని 17 మంది రిటర్నింగ్ అధికారులు, 119 మంది సహాయ రిటర్నింగ్ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో నమూనా లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్‌లాల్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఐదు చొప్పున వీవీప్యాట్ యంత్రాలను లెక్కించే విధానం తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

మొదట సర్వీసు ఓటర్ల ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాక ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నట్లు రజత్‌కుమార్‌ చెప్పారు. ఈవీఎం, వీవీప్యాట్‌లలో తేడా ఉంటే వీవీప్యాట్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నందున మల్కాజ్‌గిరిలో 24, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నిజామాబాద్‌లో 18 ఓట్ల లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.