BJP Bhim Deeksha: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR).. భారత రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్బంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ఈ రోజు (గురువారం) ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసియార్ కి ఎందుకు ఇంత అహంకారం? అంటూ ప్రశ్నించారు. చేసిందే తప్పయితే.. టీఆరెస్ నేతలు ఆ వ్యాఖ్యలను సమర్ధించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారంటే.. అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే అని అన్నారు. ప్రధాని మోడీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను సగౌరవంగా సత్కరిస్తున్న ప్రభుత్వం మాది అంటూ వెల్లడించారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకొద్దు, నేనే రాజ్యాంగం రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అన్నట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. తనను ఎవరూ ప్రశ్నించవద్దు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయవద్దు అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయక పోవడానికి కారణం కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు. నేడు రాజ్యాంగం మార్చాలి అన్నాడు. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలని అంటాడేమో..? అని అంటూ సందేహం వ్యక్తం చేస్తూ సెటైర్లు సందించారు బండి సంజయ్.
బీజేపీ భీమ్ దీక్ష పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి రాజ్ ఘాట్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష ఈ నిరసన కార్యక్రమం ప్రారంభించారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షకు చేపట్టారు. కర్నాటక ఎంపీ మునుస్వామి, రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు ఈ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా భీం దీక్షలు చేపట్టారు తెలంగాణ బీజేపీ.
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై మాట్లాడిన సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బీజేపీ పలు కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు చేసింది. అయితే ఈ దీక్ష ద్వారా కేసీఆర్‌ను రాజ్యాంగ ద్రోహిగా దేశల ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశంపై పోరాడాలని వ్యూహం రచిస్తోంది.
ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..
RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..