ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చజెప్పడంతో టీడీపీ మంత్రి శిద్ధా రాఘవరావు వెనక్కి తగ్గారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న చంద్రబాబు సూచనకు శిద్ధా అంగీకరించారు. నిన్న సీఎంతో సమావేశమైన అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటే ప్రజలు, మద్దతుదారులు అంగీకరించడం లేదని అన్నారు.
దర్శి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేయాలని ప్రజలు కోరుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీంతో దుమారం రేగింది. చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడింది. దర్శి అసెంబ్లీ స్థానాన్ని చంద్రబాబు ఉగ్ర నరసింహారెడ్డి పేరును ఖరారు చేశారు.