AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ నేతల మీటింగ్ క్లిప్ నెట్టింట్లో షేర్ చేసిన లోకేష్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో అడ్డంగా దొరికిపోయారంటూ వ్యాఖ్య

Nara Lokesh on YSRCP MPs : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి వైసీపీ ఎంపీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి మధ్య సాగిన సంభాషణను టీడీపీ ప్రధాన కార్యదర్శి..

వైసీపీ నేతల మీటింగ్ క్లిప్ నెట్టింట్లో షేర్ చేసిన లోకేష్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో అడ్డంగా దొరికిపోయారంటూ వ్యాఖ్య
Venkata Narayana
|

Updated on: Feb 05, 2021 | 10:41 PM

Share

Nara Lokesh on YSRCP MPs : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి వైసీపీ ఎంపీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి మధ్య సాగిన సంభాషణను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు. పార్టీ స్టాండ్‌పై వారి మధ్య సాగిన సంభాషణపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడని లోకేష్ మండిపడ్డారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాకారం అయిన స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని లోకేష్ మండిపడ్డారు.

“విశాఖ ఉక్కు అమ్మ‌కం @ysjagan ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చేసిన న‌మ్మ‌క‌ద్రోహ‌మేన‌ని వైసీపీ ఎంపీలే.. జ‌గ‌న్‌ రెడ్డి మీడియా సాక్షిలోనే చెబుతూ అడ్డంగా దొరికిపోయారు.. సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చెయ్యాలి. 40 వేల మంది ప్రత్యక్షంగానూ, లక్షలమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” అని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొని వీడియో కూడా షేర్ చేశారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. మళ్లీ ఉద్యమం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలన్న నిర్ణయంతో రోడ్డెక్కుతోన్న పార్టీలు, సంఘాలు