Nara Lokesh – Ramya Murder case: ‘దిశ’ చట్టం అంటూ జగన్ రెడ్డి గారు బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే, ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి గారు దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో దళిత యువతి రమ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసాడు మృగాడు. అంటూ లోకేష్ అన్నారు.
ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్యని హత్య చేసిన మృగాడికి కఠిన శిక్ష పడాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.