Kurnool: ప్యాలెస్‌ను ముట్టడించే రోజులు దగ్గర్లోనే, ఎర్రబాడులో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. హై టెన్షన్ రాజకీయాలు

|

Aug 17, 2021 | 8:25 PM

తీవ్ర ఉద్రిక్తతలు, ఉత్కంఠ మధ్య కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ఇతర విపక్ష నేతల పర్యటన ఈ సాయంత్రం ముగిసింది. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి

Kurnool:  ప్యాలెస్‌ను ముట్టడించే రోజులు దగ్గర్లోనే, ఎర్రబాడులో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. హై టెన్షన్ రాజకీయాలు
Nara Lokesh
Follow us on

Kurnool – TDP – Nara Lokesh: తీవ్ర ఉద్రిక్తతలు, ఉత్కంఠ మధ్య కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ఇతర విపక్ష నేతల పర్యటన ఈ సాయంత్రం ముగిసింది. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన జహీరా అనే బాలిక హత్య జరిగి ఏడాది అవుతున్నా ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయనందుకు నిరసనగా బాధితులను పరామర్శించేందుకు కర్నూలు జిల్లాకు వచ్చారు లోకేష్ సహా ఏపీ విపక్ష నేతలు. పరామర్శకు ముందు నేతలు కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో నేతలతో కాసేపు విపక్ష నేతలు మాట్లాడారు అనంతరం ఎర్రబాడు గ్రామానికి చేరుకున్నారు. హత్యకు గురైన జహీరాబి కుటుంబీకులను పరామర్శించారు. తాను అండగా ఉంటానని బాధితులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి పైన, వైసీపీ నేతల పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్ ను ముట్టడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

మహిళలపైన బాలికల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే సీఎం పబ్జి గేమ్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లోకేష్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. నేతలంతా హాజరయ్యారు. లోకేష్ తో పాటు సీపీఐ రామకృష్ణ తులసి రెడ్డి, సీపీఎం నేతలు పలువురు, ఎంఐఎం నేతలు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ జగన్ సర్కారు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “హజీరా బి ని అతి కిరాతకంగా చంపి ఏడాది అవుతుంది.. ప్రభుత్వం ఏమి చేస్తున్నది. దిశ చట్టం ఏమైంది. హాజరబి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వైసీపీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా. రాష్ట్రంలో ఇప్పటికే 500 మంది మహిళలు పై దాడులు జరిగాయి. మమ్మల్ని చూస్తే ఎందుకు మీకు ..అది దిగుతుంది. తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ అడుతున్నాడు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి మనకు న్యాయం చేస్తారా.” అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read also: ‘మీ పక్షాన నేను నిలబడ్డా, కొట్లాడుతున్నా.. మీ అక్కగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం ముందుకొస్తున్నా అధైర్యపడకండి : షర్మిల