టీడీపీ ఎంపీలు పార్టీ మారే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై టీవీ9తో కళా వెంకట్రావు మాట్లాడారు. వార్తలు వచ్చిన తర్వాత ఢిల్లీలోని తమ ఎంపీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పారాయన. పార్టీ మారే విషయమై సమాచారం లేదన్నారాయన.
కాకపోతే.. కాడికినాడలో సమావేశమైన తమ పార్టీ నాయకులతో మాట్లాడినట్టు తెలిపారు. వారిలో ఎవరికీ పార్టీ పట్ల వ్యతిరేకత లేదని, పార్టీ వీడే ఆలోచన కూడా ఎవరూ చేయడం లేదని అన్నారు. ఓడిపోయిన కారణాలపైనే వారు చర్చించుకున్నారని, పార్టీ మారే విషయమై అక్కడ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఫారిన్ టూర్ నుంచి వచ్చాక అన్నీ చర్చిద్దామని కాకినాడలో సమావేశమైన నాయకులతో చెప్పానని తెలిపారు కళా వెంకట్రావు.