జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవ‌న్ సామాజిక సందేశం

జగన్ ‌అన్నా, ఆయన ప్రభుత్వం అన్నా మొదటి నుంచి గిట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తోన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మొదటిసారి ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కర్నూల్‌లో సంచలనం రేకెత్తించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి

జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవ‌న్ సామాజిక సందేశం

Edited By:

Updated on: Feb 28, 2020 | 9:12 PM

జగన్ ‌అన్నా, ఆయన ప్రభుత్వం అన్నా మొదటి నుంచి గిట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తోన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మొదటిసారి ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కర్నూల్‌లో సంచలనం రేకెత్తించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై పవన్ స్పందించారు. బాలిక కేసులో కోరిందే జరిగిందని.. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరుపేరున అభినందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పవన్.. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం, అటు సమాజంపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అయితే సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ పవన్, కర్నూల్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆ తరువాత ప్రీతి తల్లిదండ్రులు జగన్‌ను కలవడం, వారికి భరోసా ఇవ్వడంతో ఈ కేసులో ముందుడుగు పడిన విషయం తెలిసిందే.
Read This Story Also: మాటిచ్చినట్లుగానే.. సీబీఐకి ప్రీతి బాయి కేసు‌ను అప్పగించిన జగన్..!