ఈ నెల 4 న తిరుపతిలో దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి భేటీ.. సమావేశం విజయవంతం చేయాలన్న కలెక్టర్‌

|

Mar 01, 2021 | 5:29 PM

ఈ నెల 4 న తిరుపతి పట్టణంలో నిర్వహించే 29 వ దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ..

ఈ నెల  4 న తిరుపతిలో  దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి భేటీ.. సమావేశం విజయవంతం చేయాలన్న కలెక్టర్‌
Follow us on

ఈ నెల 4 న తిరుపతి పట్టణంలో నిర్వహించే 29 వ దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ సమన్వయంగా పని చేసి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణ అశోక్ ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ కమీషనర్ పి.ఎస్.గిరీషా, జెసి (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం, జెసి (సంక్షేమం) రాజశేఖర్, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, స్మార్ట్ సిటీ జి.ఎం వి.ఆర్ చంద్రమౌళి లతో కలిసి ఈ నెల 4న తిరుపతి పట్టణము నందు నిర్వహించే 29 వ దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సంబందించి నోడల్ అధికారులు , లైజన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైజన్ అధికారులు విధులను సక్రమముగా నిర్వహించేందుకు మరొకమారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వివిద రాష్ట్రాల నుండి వచ్చే ముఖ్యమైన అధికారులకు 29 వ దక్షణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యమైన అధికారులు రావడం జరుగుతుందని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాద్యత లైజనింగ్ అధికారులదేనని తెలిపారు. లైజనింగ్ అధికారులకు కేటాయించిన అధికారులతో మాట్లాడుకుని వారు ఎప్పుడు వస్తారని , ఎంత మంది వస్తారు విమానాల ద్వారా వస్తారా వంటి వివరాలను తెలుసుకోవాలన్నారు.

బెంగళూరు – చెన్నై ఎయిర్పోర్టు నందు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. బెంగళూరు – చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చే విధంగా ఉంటే ముందుగానే సంబందిత ఎయిర్పోర్టు చేరుకోవాలని తెలిపారు. తాజ్ హోటల్ పరిసర ప్రాంతాలు మరియు ఎయిర్పోర్టు నుండి తాజ్ హోటల్ కు చేరుకొనే రోడ్ల మరమ్మత్తులను పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. ని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా కు సంబందించిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని సమావేశం జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎస్.ఈ ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్.ఈ కలెక్టర్ కు వివరించారు.

సమావేశంలో ఎల్.ఈ.డి. మైక్రో ఫోన్స్ , వీడియో కవరేజ్ సంబందించినవి జాగ్రత్తగా చేయాలని డి.ఈ. సమాచార శాఖ ఇంజినీరు ను ఆదేశించారు. ఫోటో కవరేజికి సంబందించి ఫోటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకోవాలని డిపిఆర్ఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్యమైన వి.ఐ.పి లకు ప్రోటోకాల్ ప్రకారం పుష్ప గుచ్చాలు , మొమెంటోస్ అందించేందుకు కావలసినవి అందుబాటులో ఉంచుకోవాలని జి.ఎం.డి.ఐ.సి. ని ఆదేశించారు. తాజ్ , గ్రాండ్ రిడ్జ్, మానస సరోవర్, తిరుమలలో వి.వి.ఐ.పి లు బస చేసే చోట ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వి.ఐ.పి లకు , అధికారులకు, వాహనాలకు పాసులు అందజేయాలని జెడ్.పి. సి.ఈ.ఓ ను ఆదేశించారు.

వాహనాల పార్కింగ్ , శానిటేషన్ శుభ్రంగా ఉండే విధంగా చేయాలని డి.పి.ఓ ను ఆదేశించారు. తాజ్ హోటల్ లో జరిగే సమావేశం కు సంబందించి అన్ని ఏర్పాట్లను చేయించాలని, స్నాక్స్, వాటర్ బాటల్స్, సానిటైజర్స్ , మాస్కూలు, అందుబాటులో ఉండే విధంగా చూడాలని స్మార్ట్ సిటీ జి.ఎం ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పి.డి. చంద్రశేఖర్, డిఆర్ డిఎ పి.డి. తులసి, తుడా సెక్రెటరీ లక్ష్మి, జి.ఎం.డి.ఐ.సి. ప్రతాప్, ఎస్.ఈ కార్పొరేషన్ ఈ.డీ. రాజశేఖర్ నాయుడు, మెప్మా పి.డి. జ్యోతి, ఆర్డీఓ చిత్తూరు రేణుక, జెడ్.పి. సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.ఈ. బాల కొండయ్య, నోడల్, మరియు లైజన్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

పిల్ల‌ల ఆసుప‌త్రికి 5 ఎక‌రాలు.. సీనియ‌ర్ అధికారుల స‌మీక్షలో టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి