ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇత్వా సిట్టింగ్ ఎంపీ

| Edited By:

Mar 29, 2019 | 4:18 PM

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన యూపీ రాష్ట్రంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను దక్కించుకుందామని అనుకుంటున్న సమయంలో రాష్ట్రంలోని కీలక నేత.. ఇత్వా నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దోహ్రే బీజేపీకి గుడ్‌బై చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని హస్తం గూటికి చేరారు. ఇప్పటికే బీహార్‌లోని పట్నాసాహిబ్‌ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా […]

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇత్వా సిట్టింగ్ ఎంపీ
Follow us on

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన యూపీ రాష్ట్రంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను దక్కించుకుందామని అనుకుంటున్న సమయంలో రాష్ట్రంలోని కీలక నేత.. ఇత్వా నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దోహ్రే బీజేపీకి గుడ్‌బై చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని హస్తం గూటికి చేరారు. ఇప్పటికే బీహార్‌లోని పట్నాసాహిబ్‌ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌కుమార్‌ దోహ్రే బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అశోక్ కుమార్ దోహ్రే 2.66 లక్షల భారీ మెజార్టీతో ఇత్వా నుంచి గెలిచారు. అశోక్ కుమార్ కు మొత్తం 4.39లక్షల ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఇక్కడి నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి కేవలం 11వేల ఓట్లను మాత్రమే పొందారు. అశోక్ కుమార్ దోహ్రే చేరికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.