రంజాన్ వస్తోంది… పోలింగ్ వేళలపై ఈసీకి సుప్రీం ఆదేశం

| Edited By:

May 02, 2019 | 5:27 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంజాన్‌ నెల ప్రారంభమవుతున్న దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మార్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వివిధ ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు స్పందించింది. రాజస్థాన్‌లో ఎండవేడిమిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాలను మార్చాలని సూచించింది. ఈ నెల 5న రంజాన్ నెల ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మే 6, 12, 19 తేదీల్లో జరిగే […]

రంజాన్ వస్తోంది... పోలింగ్ వేళలపై ఈసీకి సుప్రీం ఆదేశం
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంజాన్‌ నెల ప్రారంభమవుతున్న దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మార్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వివిధ ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు స్పందించింది. రాజస్థాన్‌లో ఎండవేడిమిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాలను మార్చాలని సూచించింది. ఈ నెల 5న రంజాన్ నెల ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మే 6, 12, 19 తేదీల్లో జరిగే చివరి మూడు దశల ఎన్నికలు, రంజాన్‌ మాసంలోనే జరుగనున్నాయి.

మార్చి 10న ఎన్నికల తేదీలను ప్రకటించగానే… ఈ తేదీలు రంజాన్ నెల ఒకేసారి వచ్చాయన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే రంజాన్ రోజు, శుక్రవారాలను పోలింగ్ షెడ్యూల్ నుంచి మినహాయించామని ఈసీ వివరణ ఇచ్చింది. మొత్తం నెలను మార్చలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విపరీతమైన ఎండవేడిమి, రంజాన్ నెల కారణంగా ముస్లిం ఓటర్లు క్యూలైన్లలో నిలబడడం కష్టమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ వేళల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.