Kakani: కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి లేదు : కాకాణి

|

Aug 01, 2021 | 3:07 PM

కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి లేదని..

Kakani: కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి లేదు : కాకాణి
Kakani
Follow us on

Krishna Waters – Kakani – TDP: కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఇరు రాష్ట్రాల ఉమ్మడి జలాశయం కాబట్టే కేంద్రం జోక్యం చేసుకుందని ఆయన వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ రకరకాల విమర్శలు చేయడం సిగ్గుచేటన్న కాకాణి, టీడీపీలో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్లు మాట్లాడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

నెల్లూరులో ఇవాళ ఎమ్మెల్యే కాకాణి ప్రెస్ మీట్‌ నిర్వహించారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని కాకాణి చెప్పుకొచ్చారు. నీటి హక్కులను కాపాడటం కోసం పోరాటం చేస్తున్నామన్న ఆయన, టీడీపీ నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తోందన్నారు. రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచిన టీడీపీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతోందని విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పై టీడీపీ స్టాండ్ ఏంటో వెంటనే చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు.

ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. టిడిపి వాదనల్లో శబ్దం ఎక్కువ, సారాంశం తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతాంగం ప్రయోజనాల కోసం అందరితో కలిసి పనిచే సేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

Read also: