టీఆర్‍ఎస్…ఆర్‍ఎస్‍ఎస్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘తాము.. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులమని, తెరాస ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలంటూ కొందరు చేస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం గులాబీ నేతలనే కాదు.. సామాన్య ప్రజలనూ అయోమయానికి గురిచేస్తోంది. అవును…తెరాస ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? వారు నిజంగా భారతీయ జనతాపార్టీ (భాజపా) భావజాల మాతృక అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌) కార్యకర్తలు కాదు.. తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉండటానికి ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి […]

టీఆర్‍ఎస్...ఆర్‍ఎస్‍ఎస్

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:03 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘తాము.. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులమని, తెరాస ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలంటూ కొందరు చేస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం గులాబీ నేతలనే కాదు.. సామాన్య ప్రజలనూ అయోమయానికి గురిచేస్తోంది. అవును…తెరాస ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? వారు నిజంగా భారతీయ జనతాపార్టీ (భాజపా) భావజాల మాతృక అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌) కార్యకర్తలు కాదు.. తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉండటానికి ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యులు. తమను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా పరిచయం చేసుకుంటున్నారు.