Uttar Pradesh BJP: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రామ మందిర నిర్మాణమే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం కానుందా?

|

Jun 05, 2021 | 8:03 PM

Uttar Pradesh BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెస్ట్ బెంగాల్ లో భంగ పడిన తరువాత కొంత నిరాశలో పడినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నంత పట్టుదలతో మామతా బెనర్జీ పై పోరుకు సిద్ధం అయింది బీజేపీ.

Uttar Pradesh BJP: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రామ మందిర నిర్మాణమే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం కానుందా?
Uttar Pradesh Bjp
Follow us on

Uttar Pradesh BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెస్ట్ బెంగాల్ లో భంగ పడిన తరువాత కొంత నిరాశలో పడినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నంత పట్టుదలతో మామతా బెనర్జీ పై పోరుకు వెళ్ళిన బీజేపీ ఏమాత్రం అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దీనికి కారణం ఒక్కటే అని ఆ పార్టీ నమ్ముతోంది. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రజలకు మానసికంగా దగ్గరగా ఉన్న సమస్యల ఆధారంగా తన ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీజేపీ మమతా పై విమర్శల దాడి.. మోడీ నామ జపంతో ప్రచారాన్ని నెట్టుకొచ్చింది. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ ముందు అతి పెద్ద సవాల్ వచ్చి ఉంది. అది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఈ ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే, ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఇక్కడే ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు అతి పెద్ద ఎన్నికలు యూపీ ఎన్నికలే అవుతాయి. అదేవిధంగా ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతే, ఆ ప్రభావం పార్టీ పై తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు బీజేపీ తో పాటు సంఘ్ పరివార్ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనేదానిపై కసరత్తులు మొదలు పెట్టేశాయి.

ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మమతా చేసినట్టుగానే.. యూపీలో బీజేపీ చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. ప్రజల మనసులకు కనెక్ట్ అయిన సమస్యలను ఆశ్రయించాలని భావిస్తోంది. అందుకే రామ మందిర నిర్మాణం కేంద్రంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీ బీజేపీ రాష్టార్ మాజీ అధ్యక్షుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ”జాతీయతకు సంబంధించిన సమస్యలను కేంద్ర స్థానంలో ఉంచడం ద్వారా మాత్రమే పార్టీ యూపీ ఎన్నికలకు వెళ్తుంది. రాముని ఆలయ నిర్మాణం బీజేపీ సాధించిన అతి పెద్ద ఘనత. కనుక ఆ అంశాన్నే ప్రధానంగా చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. అదీకాక యూపీ ప్రజలకు ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ లాంటిది.” అని చెప్పారు.

ఇక బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్నికల ప్రచారాన్ని రెండు దశలుగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి సంబంధించి పార్టీ నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ.. హిందుత్వ సమస్యల వైపు ప్రజల దృష్టిని మరల్చే పని చేస్తుంది.

బీజేపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బీజేపీ ప్రణాళిక ఇలా ఉండబోతోంది..

  • యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రెండు దశలుగా విభజించనున్నారు.
  • మొదటి దశలో ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ మంచి పనులపై దృష్టి సారించనున్నారు.
  • ఎన్నికలకు ముందు, రెండవ దశలో, రాముడి ఆలయాన్ని కేంద్రస్తానంలో ఉంచడం ద్వారా ముందుకు తీసుకువెళతారు.
  • ప్రజల దృష్టి క్రమంగా మానసికంగా అనుసంధానించబడిన సమస్యల వైపు మళ్ళిస్తారు.
  • రాముని ఆలయ నిర్మాణం తన ఘనతగా చెప్పడం ద్వారా హిందుత్వ చిత్రాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుంది.
  • బీజేపీ కార్యకర్తల కనెక్టివిటీపై దృష్టి పెడతారు. బీజేపీ కార్యకర్తలకు గ్రాస్ రూట్ కనెక్టివిటీ తక్కువగా ఉందని భావిస్తున్నారు. అందుకే దీనిపై మొదట దృష్టి సారిస్తారు

Also Read: బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ …..సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి కీలక పదవి

Etela vs Harish : ఈటెల రాజేందర్‌‌ తీరును చీల్చి చెండాడిన మంత్రి హరీష్ రావు.. భావ‌దారిద్య్రం అంటూ..