వైసీపీ టు వైసీపీ…వయా బీజేపీ, టీడీపీ

| Edited By: Srinu

Mar 06, 2019 | 6:25 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత‌ అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఐదేళ్ల కాలంలో అన్ని ప్రధాన పార్టీలను ఆయన కవర్ చేసేశారు. జగన్ వైఖరితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరారు. వీలు చిక్కినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడేవారు. ఆ తర్వాత బీజేపీలో పొసగక సైకిలెక్కారు. అక్కడా ఎక్కువ కాలం ఉండలేక తిరిగి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం […]

వైసీపీ టు వైసీపీ...వయా బీజేపీ, టీడీపీ
Follow us on

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత‌ అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఐదేళ్ల కాలంలో అన్ని ప్రధాన పార్టీలను ఆయన కవర్ చేసేశారు. జగన్ వైఖరితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరారు. వీలు చిక్కినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడేవారు. ఆ తర్వాత బీజేపీలో పొసగక సైకిలెక్కారు. అక్కడా ఎక్కువ కాలం ఉండలేక తిరిగి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజు సడన్‌గా పార్టీని వీడటం వెనుక చాలా తతంగమే నడిచిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నరసాపురం టిక్కెట్‌పై టీడీపీ అధిష్ఠానం ఎటూ తేల్చకపోవంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారనున్నారన్న ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. వారం రోజుల క్రితం ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను టీడీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

రెండ్రోజుల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. శుక్రవారం హైదరాబాద్‌లో తన సన్నిహితులతో సమావేశమైన రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి వైసీపీలోనే చేరితే మంచిదని సన్నిహితులు అభిప్రాయపడటంతో ఆయన అంగీకరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నాని తెలిపారు.