చిన్నమ్మకు చోటు ఖాయం.. మోదీ షరతేంటంటే ?

|

Oct 26, 2019 | 5:02 PM

పురంధేశ్వరి మరోసారి కేంద్ర మంత్రి కాబోతున్నారా ? పరిస్థితులు.. కొందరి నేతల మూవ్‌మెంట్స్ చూస్తుంటే నిజమేనంటున్నారు బిజెపి శ్రేణులు. బిజెపిలో చేరిన తర్వాత మోదీ గత ప్రభుత్వంలోనే పురంధేశ్వరి కేబినెట్ మంత్రి అవుతారని, ఏపీలో బిజెపి చక్రం తిప్పాలంటే పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అప్పట్లో పలువురు బిజెపి అగ్రనాయకత్వానికి సూచించారు. దానికి తోడు టిడిపికి దూరమవుతున్న క్రమంలో ఓ సామాజికి వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే పురంధేశ్వరికి మంత్రి పదవి కట్టబెట్టాలని కొందరు చెప్పారు. ఈ క్రమంలో […]

చిన్నమ్మకు చోటు ఖాయం.. మోదీ షరతేంటంటే ?
Follow us on

పురంధేశ్వరి మరోసారి కేంద్ర మంత్రి కాబోతున్నారా ? పరిస్థితులు.. కొందరి నేతల మూవ్‌మెంట్స్ చూస్తుంటే నిజమేనంటున్నారు బిజెపి శ్రేణులు. బిజెపిలో చేరిన తర్వాత మోదీ గత ప్రభుత్వంలోనే పురంధేశ్వరి కేబినెట్ మంత్రి అవుతారని, ఏపీలో బిజెపి చక్రం తిప్పాలంటే పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అప్పట్లో పలువురు బిజెపి అగ్రనాయకత్వానికి సూచించారు. దానికి తోడు టిడిపికి దూరమవుతున్న క్రమంలో ఓ సామాజికి వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే పురంధేశ్వరికి మంత్రి పదవి కట్టబెట్టాలని కొందరు చెప్పారు. ఈ క్రమంలో 2016 మొదలుకుని 2019 ఎన్నికల దాకా పురంధేశ్వరికి మంత్రి పదవి అన్న కామెంట్లు, వార్తలు, గాసిప్స్.. వదంతులు.. తరచూ చెలరేగాయి.

తాజాగా నరేంద్ర మోదీ తన మంత్రి వర్గంలో చిన్నపాటి మార్పులకు సిద్దమవుతున్నారన్న సమాచారంతో మరోసారి పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్‌లో చోటు ఖాయమన్న వార్తలు మొదలయ్యాయి. దానికి ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి బిజెపిలో వుండడం.. ఆమె భర్త దగ్గుబాటు వెంకటేశ్వర రావు, ఆమె తనయుడు హితేశ్ వైసీపీలో కొనసాగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భార్య బిజెపిలో, భర్త వైసీపీలో అంటూ కామెంట్లు ఎక్కువయ్యాయి. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి.. బిజెపి, వైసీపీ రెండు పార్టీలు లోపాయికారీ అవగాహనతో ముందుకెళుతున్నాయంటూ దగ్గుబాటు ఫ్యామిలీని ఎత్తి చూపుతున్నారు.

ఈ కామెంట్లో ఆ నోటా.. ఈ నోటా.. జగన్ చెవికి చేరడంతో ఆయన దగ్గుబాటిని పిలిచి.. అటో ఇటో తేల్చుకోవాలని ఆదేశించినట్లు కథనాలున్నాయి. మొత్తం ఫ్యామిలీ ఏదైనా ఒక పార్టలో వుండడం బెటరంటూ నిర్దిష్ట గడువుతో దగ్గుబాటిని హెచ్చరించినట్లు సమాచారం. దాంతో దగ్గుబాటి కాస్తా అంతర్మధనానికి గురయ్యారని తెలుస్తోంది. తనయుడు హితేశ్ ఫ్యూచర్ కోసమే తాను వైసీపీలో చేరితే ఇపుడు పరిస్థితి తిరగబెడుతోందన్న మధనం దగ్గుబాటి వెంకటేశ్వర రావులో కలిగినట్లు తెలుస్తోంది.

ఇలాంటి దశలో నరేంద్ర మోదీ తన కేబినెట్‌లో స్వల్ప మార్పులు, చేర్పులకు సిద్దమవుతున్నారు. దానికి తోడు తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వుంది. ఏపీకి లేదు. జివిఎల్ నరసింహరావు, సుజనా చౌదరి లాంటి వారు తమకు మంత్రి పదవి లభిస్తే బావుంటుందన్న అభిప్రాయంతో వున్నా.. బయట పడేందుకు సాహసించడం లేదు. అయితే వీరిద్దరికి మంత్రి పదవులిచ్చినా.. గ్రౌండ్ లెవల్‌లో బిజెపి లాభించేది పెద్దగా ఏమీ లేదు. అదే సమయంలో పురంధేశ్వరికి మంత్రిపదవి ఇస్తే ఆమె సామాజిక వర్గానికి మంచి సందేశం పంపినట్లు అవుతుంది. ఇప్పటికే చేజారుతున్న టిడిపి శ్రేణులను బిజెపి వైపునకులాగే రాజకీయ పరిణితి పురంధేశ్వరికి వుందన్న నమ్మకంతో త్వరలో జరగబోయే మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో పురంధేశ్వరికి చోటు కల్పించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. పురంధేశ్వరి బిజెపిలో కొనసాగడంతోపాటు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావును కూడా బిజెపి వైపునకు తీసుకువస్తే.. ఆమెకు కేబినెట్ బెర్త్ దక్కడం మరింత సులువు అవుతుందన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏ క్షణంలో ఏ మార్పు సంభవిస్తుందో ఊహించడం కాస్తా కష్టమే అన్నది నిర్వివాదాంశం.