మీ అభిమానం ముందు..బారికేడ్లు ఎంత?..ప్రియాంక ఫీట్ చూశారా?

|

May 14, 2019 | 5:18 PM

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రియాంక కొత్త ఫీట్ చేశారు. తనకు అభివాదం చేస్తున్న జనాన్ని కలిసేందుకు బారికేడ్ దూకి మరి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. ఈ ఒక్క విషయంలోనే కాదు..మోదీ ఫాలోవర్స్‌కి కారు ఆపి మరీ  షేక్ హ్యాండ్ ఇవ్వడం, పాములు ఆడించేవాళ్లతో సరదాగా గడపడం, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని స్పెషల్ […]

మీ అభిమానం ముందు..బారికేడ్లు ఎంత?..ప్రియాంక ఫీట్ చూశారా?
Follow us on

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రియాంక కొత్త ఫీట్ చేశారు. తనకు అభివాదం చేస్తున్న జనాన్ని కలిసేందుకు బారికేడ్ దూకి మరి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. ఈ ఒక్క విషయంలోనే కాదు..మోదీ ఫాలోవర్స్‌కి కారు ఆపి మరీ  షేక్ హ్యాండ్ ఇవ్వడం, పాములు ఆడించేవాళ్లతో సరదాగా గడపడం, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని స్పెషల్ ప్లైట్‌లో ఎయిమ్స్‌కి తరలించడం లాంటి ఘటనలు చూసి ప్రియాంక మనసుకు ఫిదా అవుతున్నారు ప్రజలు. మరోవైపు వాగ్ధాటిలోనూ ప్రియాంక తన స్టైల్ చూపిస్తున్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ నేతలకు చురకలంటిస్తూ ముందుకు సాగుతున్నారు.