ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం..ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

|

Aug 13, 2019 | 4:42 PM

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై పార్టీ నేతల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  ఈ వ్యవహారంపై తొలిసారి ప్రియాంక గాంధీ తొలిసారి నోరు విప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రంపై విరుచుకుపడ్డారు. నిబంధనలను పాటించకుండా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసిందని ప్రియాంక స్ఫష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధం కశ్మీర్‌ను విభజించారని… […]

ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం..ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
priyanka gandhi convoy accident
Follow us on

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై పార్టీ నేతల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  ఈ వ్యవహారంపై తొలిసారి ప్రియాంక గాంధీ తొలిసారి నోరు విప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రంపై విరుచుకుపడ్డారు. నిబంధనలను పాటించకుండా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసిందని ప్రియాంక స్ఫష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధం కశ్మీర్‌ను విభజించారని… అలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు నిబంధనలను పాటించాల్సిన పనిలేదా అని ప్రశ్నించారు.