AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Governor : ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్‌.. అత్యున్నత సేవలకు దక్కిన గుర్తింపుగా ప్రదానం..

Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు తమిళసైను వరించింది.

Telangana Governor : ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్‌..  అత్యున్నత సేవలకు దక్కిన గుర్తింపుగా  ప్రదానం..
uppula Raju
|

Updated on: Mar 05, 2021 | 8:39 PM

Share

Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు తమిళసైను వరించింది. యూఎస్ కాంగ్రెస్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందించే ఈ అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు. గవర్నర్ తమిళసైతో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్‌ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.

ఇటీవల గవర్నర్ తమిళిసై తను బాధ్యతలు చేపట్టిన నుంచి జరిగిన పరిణామాలను ఒక్కదగ్గర చేర్చుతూ పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన అమూల్యమైన అనుభవాలకు అక్షరరూపం దాల్చుతూ.. ‘మూవింగ్‌ ఫార్వార్డ్‌ విత్‌ మెమొరీస్‌ ఆఫ్‌ మెయిడెన్‌ ఇయర్’పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది. ఈమె 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆమె వృత్తి రీత్యా వైద్యులు.

మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..? సమయానికి ప్రీమియం కట్టలేక వదిలేసారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే..

Mike procter: వరుసగా 6 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు.. క్రికెట్ చరిత్రలో అలాంటి ఘనత ఎవరు సాధించారో తెలుసా..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!