తూర్పుగోదావరి రాజోలు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. మలికిపురం ఎస్ఐ రామారావు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ.. అనుచరులతో కలిసి మొన్న పోలీస్టేషన్‌ను ముట్టడించిన ఎమ్మెల్యే రాపాక.
పోలీస్టేషన్ పై దాడి, అధికారుల విధులకి ఆటంకం ఘటనలో ఎమ్మెల్యే రాపాక సహా కొంతమంది అనుచరులఫై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేసేందుకు నిన్నరాత్రంతా పోలీసులు ప్రయత్నించారు. చింతలమోరిలోని ఎమ్మెల్యే రాపాక ఇంటికి జీపులో వెళ్ళిన పోలీసులు.. ఇంట్లో ఎమ్మెల్యే లేకపోవడంతో వెనుదిరిగారు. ఎమ్మెల్యే అనుచరుల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్
రావడంతో.. వారు వెంటనే కస్టడీలోకి లొంగిపోవాలని ఇంటిసభ్యులను హెచ్చరించినట్టు సమాచారం. ఎలాగైనా ఈరోజు మధ్యాహ్నంలోగా ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడానికి పోలీసుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.