బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌లో లోక్‌సభతో పాటుగా.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అభ్యర్థుల తరపున వీరంతా ప్రచారం నిర్వహించనున్నారని బీజేపీ తెలిపింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, పలువురు కేంద్రమంత్రులు, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర మంత్రుల ఉన్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్‌ను కూడా బీజేపీ […]

బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో

Edited By:

Updated on: Apr 05, 2019 | 7:41 PM

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌లో లోక్‌సభతో పాటుగా.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ అభ్యర్థుల తరపున వీరంతా ప్రచారం నిర్వహించనున్నారని బీజేపీ తెలిపింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, పలువురు కేంద్రమంత్రులు, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర మంత్రుల ఉన్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్‌ను కూడా బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రంలో వివేక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్ ఇతర పాత్రలో కనిపించనున్నారు. ప్రధాని మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను నిర్మించారు.