అభివృద్ధికి “దీదీ” ఓ స్పీడ్‌బ్రేక‌ర్‌.. సిలిగురి సభలో ప్రధాని మోదీ

| Edited By:

Apr 03, 2019 | 8:44 PM

సిలిగురి : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ప్ర‌ధాని మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అభివృద్ధికి “దీదీ” ఓ స్పీడ్ బ్రేక‌ర్‌గా మారిందని మోదీ అన్నారు. బెంగాల్‌లోని సిలిగురిలో ఇవాళ మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. మమతా బెనర్జీ పాల‌న‌లో చిట్‌ఫండ్ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని మమతా పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్ర సంక్షేమ పథకాలను అమలు చేయనివ్వకుండా ఓ స్పీడ్ బ్రేకర్ అడ్డుతగులుతుందని.. ఆ స్పీడ్ బ్రేకర్ పేరు “దీదీ” అని […]

అభివృద్ధికి దీదీ ఓ స్పీడ్‌బ్రేక‌ర్‌.. సిలిగురి సభలో ప్రధాని మోదీ
Follow us on

సిలిగురి : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ప్ర‌ధాని మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అభివృద్ధికి “దీదీ” ఓ స్పీడ్ బ్రేక‌ర్‌గా మారిందని మోదీ అన్నారు. బెంగాల్‌లోని సిలిగురిలో ఇవాళ మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. మమతా బెనర్జీ పాల‌న‌లో చిట్‌ఫండ్ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని మమతా పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్ర సంక్షేమ పథకాలను అమలు చేయనివ్వకుండా ఓ స్పీడ్ బ్రేకర్ అడ్డుతగులుతుందని.. ఆ స్పీడ్ బ్రేకర్ పేరు “దీదీ” అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆయుష్మాన్ భార‌త్ స్కీమ్ నుంచి కూడా బెంగాల్ త‌ప్పుకోవ‌డాన్ని మోదీ త‌ప్పుప‌ట్టారు.