Andhra Pradesh: ఏపీలో పెన్షన్ల ఇష్యూపై పొలిటికల్ వార్.. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం

|

Sep 05, 2021 | 8:22 PM

ఏపీలో పెన్షన్ల ఇష్యూ కాక రేపుతోంది. అర్హులకు పెన్షన్లు తొలగించారన్నది టీడీపీ ఆరోపణ. అనర్హులనే తొలగించామనేది వైసీపీ వెర్షన్. ఇలా, అధికార, ప్రతిపక్షాల మధ్య హైఓల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది.

Andhra Pradesh: ఏపీలో పెన్షన్ల ఇష్యూపై పొలిటికల్ వార్.. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం
Ycp Vs Tdp
Follow us on

ఏపీలో పెన్షన్ల ఇష్యూ కాక రేపుతోంది. అర్హులకు పెన్షన్లు తొలగించారన్నది టీడీపీ ఆరోపణ. అనర్హులనే తొలగించామనేది వైసీపీ వెర్షన్. ఇలా, అధికార, ప్రతిపక్షాల మధ్య హైఓల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు పథకాలను కట్ చేసుకుంటూ పోతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘాటు విమర్శలు చేశారు. ఒక్క నెలలోనే రెండు లక్షల పెన్షన్లను తొలగించడంతో ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారని అన్నారు. టీడీపీ ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అనర్హులను తొలగిస్తే… ఏదో కొంపలంటుకున్నట్లు ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలపై ఫైరయ్యారు. కార్లలో తిరిగేవాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్లు ఇవ్వాలా అంటూ మంత్రి అవంతి ప్రశ్నించారు.

అయితే, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. అర్హులకు కూడా పెన్షన్లు తొలగించారంటూ అధికారులపై ఫైరయ్యారు. చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పెన్షన్ల తొలగింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రమాణస్వీకారం రోజు తొలి సంతకం పెట్టిన పథకమే సక్రమంగా అమలు కావడం లేదంటూ ఆరోపించారు. మొత్తానికి, ఏపీలో పెన్షన్ల తొలగింపు …పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతోంది.

Also Read: దిశ ఘటనలో ఊహించని ట్విస్ట్… బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన 38 మంది సినీ ప్రముఖులపై కేసు

ఇంజిన్ లేదు, ఇంధ‌నం అవ‌స‌రం లేదు.. అయినా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం