తమిళనాడు అన్నాడీఎంకేలో పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ చీఫ్ పదవి విషయంలో పన్నీర్, పళని మధ్య రాజీ కుదిరింది. శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు పళనిస్వామి. పార్టీ బాధ్యతలను పన్నీర్‌సెల్వంకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. డిప్యూటీ చీఫ్‌గా ఉండనున్నారు పళనిస్వామి. పార్టీ చీఫ్ పదవికి ఎన్నికల్లో పోలింగ్ కు ముందు రాజీ కుదిరింది. శశికళకు ఎంట్రీ ఇవ్వకూడదని ఈపీఎస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే పార్టీ బాద్యతలనుంచి తప్పుకునేందుకు సిద్ధమైన పలని. అయితే మరోవైపు పార్టీ క్యాప్చర్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు శశికళ. పార్టీలోకి నా ఎంట్రీ ఆపలేరని మరోసారి చిన్నమ్మ ప్రకటన చేయడం ఇక్కడ సంచలనంగా మారింది.
ఇక నిన్న చెన్నై మెరీనా బీచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. దివంగత జయలలిత వర్ధంతి సందర్బంగా ఆమె సమాధి దగ్గర నివాళి అర్పించేందుకు శశికళ వర్గం , పళని-పన్నీర్ వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జయలలిత సమాధి దగ్గర మరోసారి ప్రమాణం చేశారు శశికళ. అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తీసుకొస్తాననని అన్నారు. కార్యకర్తలతో కూడా ప్రమాణం చేయించారు. పార్టీలో పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు శశికళ. పార్టీలోకి తన ఎంట్రీని ఎవరూ ఆపలేరని కూడా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..