AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య పదవికి ఎసరు..వన్ మంత్ డెడ్‌ లైన్!

టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య దూకుడుకు ఏపీ ప్రభుత్వం బ్రేకులు వేయబోతుంది. వెంటనే పదవిలో నుంచి తప్పుకోవాలని అధికారుల నుంచి ఆయనకు నోటీసులు అందాయి. ఈ మేరకు నెల పాటు డెడ్‌ లైన్ విధించారు.  అలాగే విజయవాడ జోనల్‌ చైర్మన్‌ పార్థసారధికి సైతం ఓ నెల లోపు పదవి నుంచి తప్పుకోవాలని నోటీసులు పంపారు. అలాగే కడప జోనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం […]

ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య పదవికి ఎసరు..వన్ మంత్ డెడ్‌ లైన్!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 3:50 PM

Share

టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య దూకుడుకు ఏపీ ప్రభుత్వం బ్రేకులు వేయబోతుంది. వెంటనే పదవిలో నుంచి తప్పుకోవాలని అధికారుల నుంచి ఆయనకు నోటీసులు అందాయి. ఈ మేరకు నెల పాటు డెడ్‌ లైన్ విధించారు.  అలాగే విజయవాడ జోనల్‌ చైర్మన్‌ పార్థసారధికి సైతం ఓ నెల లోపు పదవి నుంచి తప్పుకోవాలని నోటీసులు పంపారు. అలాగే కడప జోనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు చాలావరకు రాజీనామాలు చేసేశారు.  ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్న వర్ల రామయ్య మాత్రం పదవిలో కొనసాగుతున్నారు అందుకే ప్రభుత్వం నోటీసులు పంపింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఛైర్మన్ పదవీ కాలం ఏడాది మాత్రమే అంటున్నారు అధికారులు. వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24తోనే ముగిసినట్లు చెబుతున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్‌-8లోని సబ్ కండిషన్-2 ప్రకారం.. నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నోటీసు పంపారు. మరి ఈ నోటీసుపై వర్ల రామయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ నెలలోపే రాజీనామా చేస్తారా.. లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.

కాగా ప్రస్తుతం వర్ల రామయ్య ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షమ కార్యక్రమాలలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం.

Follow Us
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!