కేరళలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీని బదులు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సినిమా హాళ్లు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ , బార్లు తదితరాలను మూసివేయాలని నిర్ణయించామన్నారు. నేడు జరిపిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. పూర్తి లాక్ డౌన్ విధించరాదని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. శని, ఆదివారాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసర సర్వీసులను అనుమతిస్తామని ఆయన చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకల్లా అన్ని షాపులను, రెస్టారెంట్లను మూసివేయాలని, రాత్రి 9 గంటల వరకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు. అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన ఫంక్షన్లు, గేదరింగ్ లను నిషేధిస్తున్నామన్నారు . ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అనుమతించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేరళలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. కాగా నిన్న ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 28,469 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేంతో ఈ కేసుల సంఖ్య 2.18,893 కి చేరుకుంది.
ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఇంట్లో స్వీయ నియంత్రణలో ఉన్నారు. దేశంలో కోవిద్ ప్రబలంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Whatsapp: 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్..!
AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో 9,881 పాజిటివ్ కేసులు