దేశంలో నానాటికీ కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉండగా వాటిని రైతు సంఘం (భారతీయ కిసాన్ యూనియన్) నేత రాకేష్ తికాయత్ తుంగలో తొక్కారు. ఈ రూల్స్ ని అతిక్రమించి ఘాజీపూర్ బోర్డర్లో ముస్లిములకు, రైతులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ తామేమీ తప్పు చేయలేదని, ఈ విందుకు హాజరైనవారంతా తగిన దూరంలోనే కూర్చున్నారని, అసలు ఎవరూ ఒకరినొకరు హగ్ చేసుకోవడం గానీ, చేతులు కలపడం గానీ చేయలేదని ఆయన చెప్పారు. (అయితే వీడియో చూస్తే వీరు ఒకరికొకరు ఎంత దూరం కూర్చున్నారో తెలుస్తుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి)). 50 మంది ఒక చోట కలుసుకోవచ్చునని ప్రభుత్వం అనుమతించిందని తికాయత్ తెలిపారు. తాను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి 22 నుంచి సుమారు 35 మంది మాత్రం హాజరయ్యారని ఆయన చెప్పారు. రైతులకు కోవిడ్ వ్యాక్సీన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కోవిడ్ సమయంలో రైతులంతా ఇళ్లలోనే ఉన్నారని,ఫలానా చోటికి వెళ్లాలని తాము వారికి ఏం చెబుతామని ఆయన అన్నారు.’ ఇక్కడ ఘాజీపూర్ బోర్డర్లో కరోనా వ్యాప్తి చెందిందా ? గత 5 నెలలుగా మేం ఇక్కడే ఉన్నాం !’ అని ఆయన తెలిపారు. ఇది ఇప్పుడు తమ ఇల్లు అని వ్యాఖ్యానించారు. ఇక్కడ అన్నదాతలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఓ శిబిరాన్ని ఏర్పాటు చేయాలనీ ఆయన ప్రభుత్వాన్ని కోరారు.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా..అన్నదాతలు తమ ఆందోళన విరమించబోరని ఆయన ఇటీవల స్పష్టం చేశారు. వివాదాస్పద మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వారు తమ నిరసనలను కొనసాగిస్తూనే ఉంటారని రాకేష్ తికాయత్ వెల్లడించారు. అయితే ఆందోళనా స్థలాల్లో రైతులు కోవిడ్ రూల్స్ పాటిస్తారని ఆయన అన్నారు.
#RakeshTikait and fake farmers host iftar ….At Delhi Border
Blocking oxygen tanks … And delaying them ….
— Srikanth (@Srikanth4Bharat) April 21, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Supreme Court: కరోనా ఉధృతిపై కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్.. వైరస్ కట్టడికి ప్రణాళిక రూపొందించాలని నోటీసులు
పెళ్లి కూతురుగా గుత్తా జ్వాలా.. మరికాసేపట్లో పెళ్ళిపీటలెక్కనున్న వధూవరులు.. ఫోటోస్ వైరల్..