కేబినెట్ మంత్రి పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా

పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తన కేబినెట్ మంత్రి పదవికి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో రాజీనామా పత్రాన్ని జతచేసి ట్వీట్ చేశారు.  ఈనెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి… తన రాజీనామాల లేఖను కూడా సమర్పించినట్లు తెలిపారు. అయితే సిద్ధు రాజీనామాకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు. గతకొన్ని రోజులుగా సిద్ధుకు… పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మధ్య […]

కేబినెట్ మంత్రి పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా

Updated on: Jul 14, 2019 | 12:33 PM

పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తన కేబినెట్ మంత్రి పదవికి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో రాజీనామా పత్రాన్ని జతచేసి ట్వీట్ చేశారు.  ఈనెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి… తన రాజీనామాల లేఖను కూడా సమర్పించినట్లు తెలిపారు. అయితే సిద్ధు రాజీనామాకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు.

గతకొన్ని రోజులుగా సిద్ధుకు… పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మధ్య సఖ్యత లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధు మంత్రిపదవికి రాజీనామా చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us