మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న ఎన్డీఏ

| Edited By:

May 25, 2019 | 7:25 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే బలపరిచారు. దీంతో […]

మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న ఎన్డీఏ
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే బలపరిచారు. దీంతో లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ ఎన్నికైనట్టు అమిత్‌షా ప్రకటించారు. ఎన్డీఏ నేతగా ఎన్నికైన వెంటనే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.