ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్.. సీఎం జగన్‌పై మరోమారు ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి జగన్ నివాసాలపై స్పందించారు. ఒక్కో ఊరికి ఒక్కో రాజభవనం అంటూ.. సీఎం జగన్ నివాసాల గురించి ప్రస్తావించారు. ‘హైదరాబాద్‌లోని జగన్ నివాసానికి సెక్యూరిటీ నిమిత్తం రూ.24 లక్షలు వృథా ఖర్చు అంటూ ఓ ఇంగ్లీషు ఛానెల్‌లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్‌ను లోకేష్.. స్క్రీన్ షాట్’ తీసి తన ట్వీట్‌లో షేర్ చేశారు. ‘ఇప్పుడే ఏమైంది, బెంగుళూరు ప్యాలెస్సు, ఇడుపులపాయ ఎస్టేటు, కడపలో గెస్ట్ హౌసు, పులివెందులలో భవంతి, ఇలా ఊరికి ఒక రాజ భవనం, ప్రతి రాజ భవనానికి ఒక జీఓ ఇస్తాం.’ అంటూ నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇప్పుడే ఏమైంది, బెంగుళూరు ప్యాలెస్సు, ఇడుపులపాయ ఎస్టేటు, కడపలో గెస్ట్ హౌసు, పులివెందులలో భవంతి, ఇలా ఊరికి ఒక రాజ భవనం, ప్రతి రాజ భవనానికి ఒక జీఓ ఇస్తాం.. pic.twitter.com/61eEWUBseX
— Lokesh Nara (@naralokesh) July 24, 2019