అమలాపురం సభలో హరీష్‌ను ప్రశంసించిన మంత్రి లోకేష్

‘మిత్రులారా నాకు అక్కాచెల్లెళ్లు లేరు… సోదరులు లేరు.. నాకు ఉన్న ఏకైక సోదరుడు అమలాపురం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న గంటి హరీష్‌మాధుర్’ అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అమలాపురం ముమ్మిడివరం గేటు వద్ద జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. హరీష్‌మాధుర్‌ గురించి మాట్లాడాలని సభికులు కోరినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ‘హరీష్‌తో ఏడాది నుంచి నాకు అనుబంధం ఉంది. టీడీపీ కార్యకలాపాల్లో హరీష్‌ పాత్ర కీలకమే, బూత్‌ కన్వీనర్‌ వ్యవస్థను ఏర్పాటుచేయడంలో హరీషే కీలకం’అని […]

అమలాపురం సభలో హరీష్‌ను ప్రశంసించిన మంత్రి లోకేష్

Edited By:

Updated on: Mar 29, 2019 | 6:23 PM

‘మిత్రులారా నాకు అక్కాచెల్లెళ్లు లేరు… సోదరులు లేరు.. నాకు ఉన్న ఏకైక సోదరుడు అమలాపురం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న గంటి హరీష్‌మాధుర్’ అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అమలాపురం ముమ్మిడివరం గేటు వద్ద జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. హరీష్‌మాధుర్‌ గురించి మాట్లాడాలని సభికులు కోరినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు.

‘హరీష్‌తో ఏడాది నుంచి నాకు అనుబంధం ఉంది. టీడీపీ కార్యకలాపాల్లో హరీష్‌ పాత్ర కీలకమే, బూత్‌ కన్వీనర్‌ వ్యవస్థను ఏర్పాటుచేయడంలో హరీషే కీలకం’అని లోకేష్ పేర్కొనారు. ‘బాలయోగిని ఒకే ఒక్క సారి నేను కలిశాను, ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషిచేసేవారు. ఈప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో శ్రమించారు…రహదారులు ఏర్పాటుచేశారు, మంచినీటి పథకాలు నెలకొల్పారు’ అంటూ బాలయోగి కృషిని గుర్తుకు తెచ్చుకుని ప్రశంసించారు. బాలయోగి రాజకీయ వారసునిగా మనందరి ముందుకు వచ్చిన హరీష్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపించాల్సిందిగా అమలాపురం సభలో ఓటర్లను లోకేష్ అభ్యర్థించారు.