Nandamuri Balakrishna: ‘అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా’.. వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్

చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా... అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా….అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలయ్య.

Nandamuri Balakrishna: అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా.. వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్
Balayya

Updated on: Nov 20, 2021 | 1:24 PM

రాజకీయం రాజకీయనేతల మధ్య ఉండాలి..ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా… అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా….అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలయ్య. ఇన్నాళ్లూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.  ఇక ఆగం..సహించం. ఫ్యామిలీని టచ్ చేసి చూశారు..ఇక ఇంకోసారి..మరోసారి..మళ్లీ ఇలాంటివి రిపీట్‌ అయితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు బాలయ్య నందమూరి ఆడవారిని ఎవరైనా మాట్లాడితే..హద్దు మీరి ప్రవర్తిస్తే..నోటికొచ్చినట్లు వాగితే…ఖబర్దార్ అంటూ వేలు చూపిస్తూ…వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని ఫైరయ్యారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

ఇక బాలయ్య తమ్ముడు రామకృష్ణ అయితే…కన్నీళ్లు పెట్టుకుంటూనే ఓ రేంజ్‌లో తిట్టిపోశారు. కొడాలి నాని, ద్వారంపూడి, అంబటి పేర్లను ఉచ్చరిస్తూ….ఇంకోసారి మా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హైపిచ్‌లో వార్న్ చేశారు రామకృష్ణ.

Also Read: కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు నందమూరి రామకృష్ణ స్ట్రయిట్ వార్నింగ్..

Follow Us