Nandamuri Balakrishna: కొత్త జిల్లాల ఏర్పాటుపై బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్.. హిందూపురం గురించి కీలక వ్యాఖ్యలు

|

Jan 27, 2022 | 5:34 PM

Balayya: పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది. కాగా పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని  హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ స్వాగతించారు.

Nandamuri Balakrishna: కొత్త జిల్లాల ఏర్పాటుపై బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్.. హిందూపురం గురించి కీలక వ్యాఖ్యలు
Nandamuri Balakrishna
Follow us on

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం జగన్(CM Jagan) సారథ్యంలో ఏర్పాటైన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి.  ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు.  పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది. కాగా పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని  హిందూపురం ఎమ్మెల్యే(Hindupuram MLA) నంద‌మూరి బాల‌కృష్ణ స్వాగతించారు. హామి ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. హిందూపురం వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిదని పేర్కొన్నారు. సత్యసాయి జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని బాలయ్య డిమాండ్ చేశారు. జిల్లా కార్యలయాల ఏర్పాటుకు, భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాల ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ని కోరారు.

మరోవైపు  హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు ప్రకటించకూడదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. పెనుకొండకు తరలించుకు పోయారని ఫైరయ్యారు. జిల్లా కేంద్రంగా అయినా  హిందూపురంను ఉండనివ్వాలని కోరారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కు తహశీల్దార్ వినతి పత్రం అందజేశారు.

Also Read:  50 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్​ చేయించి పెళ్లాడిన వివాహిత.. ఎందుకో ఆరా తీయగా పోలీసులు షాక్