పొలిటికల్ గ్రౌండ్ అయినా…ప్లే గ్రౌండ్ అయినా ఆమె దిగేదాకే. ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూశాం.. ఆంబులెన్స్ నడపడం చూశాం.. స్కూటర్ నడిపడం కూడా చూశాం.. మరి డప్పు కొడితే ఎలా ఉంటదో తెలుసా.. ఇదిగో ఇలా అదిరిపోయింది. ఇటీవల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎమ్మెల్యే రోజా.. అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అందరిలా ప్రోగ్రాం స్టార్ట్ చేసి సైలెంట్‌గా వెళ్లిపోతే రోజా ఎందుకవుతారు. మంగళవారం కూడా పుత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
పంచాయతీలోని 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన.. డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలతో పాటు పంచెను అందజేశారు. ఈ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే రోజా డప్పుకొట్టి.. కళాకారులని ఉత్సాహపర్చారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారని రోజా స్పష్టం చేశారు.
రోజా తమతో కలిసి డప్పు కొట్టడంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆడి పాడి స్టెప్పులేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కళాకారులు తమ జీవితాన్ని అందంగా మలచుకోవాలని రోజా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ నియోజక వర్గ అభివృద్దిపై దృష్టి సారించిన రోజా మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని రోజా కోరారు. MLA రోజా పాదిరేడు .. LM కండిగ వయా తట్నేరి నుండి తట్నేరి దళితవాడ రోడ్డు నిర్మాణానికి చొరవ చూపి ఆసియా భివ్రుద్ది బ్యాంకు ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారు.
దీంతో స్థానికులు MLA చొరవకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమెపై పూల వర్షం కురిపించి సత్కరించారు. ఏ పని చేసినా అందరి అభిమానాన్ని చూరగొనటం, ప్రత్యేకతను సంతరించు కోవడం ఎమ్మెల్యే రోజా విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..
నాన్న తాగొచ్చి కొడుతున్నాడు.. అమ్మను వేధిస్తున్నాడు.. పోలీసు స్టేషన్ మెట్లెక్కిన బాలిక