5వ విడత ఎన్నికల్లో సగం మంది నేరచరితులే

| Edited By:

Apr 30, 2019 | 6:36 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐదవ విడత ఎన్నికల్లో మొత్తం 668 మంది అభ్యర్థులకు గాను 126 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నాయి. అయితే ఇందులో బీజేపీ అభ్యర్థులే అధికంగా ఉన్నారు. బీజేపీ తరపున 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 22 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. మహిళలపై నేరాలు, మర్డర్, కిడ్నాప్ లాంటి క్రిమినల్ కేసులు వీరిపై ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం.. […]

5వ విడత ఎన్నికల్లో సగం మంది నేరచరితులే
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐదవ విడత ఎన్నికల్లో మొత్తం 668 మంది అభ్యర్థులకు గాను 126 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నాయి. అయితే ఇందులో బీజేపీ అభ్యర్థులే అధికంగా ఉన్నారు. బీజేపీ తరపున 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 22 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.

మహిళలపై నేరాలు, మర్డర్, కిడ్నాప్ లాంటి క్రిమినల్ కేసులు వీరిపై ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం.. 668 మంది అభ్యర్థుల్లో 95 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం అభ్యర్థుల్లో 14 శాతం మంది నేరచరితులే. ఆరుగురు అభ్యర్థులు దోషులుగా పరిగణించబడ్డారు.