MLA Roja – Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రోజా. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్నారు. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడ లేదేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడుతుంటే అది మీ భ్రమే అవుతుందని హితవు పలికారు.
ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన రోజు కనిపించని భువనేశ్వరి ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు. నీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారని.. ఇకనైనా భువనేశ్వరి కేర్ ఫుల్ గా ఉండాలన్నారు నగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.
సారీ చెబుతారని ఎదురుచూడటం లేద – నారా భువనేశ్వరి
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారు చంద్రబాబు సతీమణి. వాళ్లు వచ్చి సారీ చెబుతారని ఎదురుచూడటం లేదని, దానికోసం టైమ్ వేస్ట్ చేసుకోనని అన్నారు నారా భువనేశ్వరి. ఆ వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డామని, ఎవరైనా మహిళల్ని గౌరవించాలని కోరారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. హెరిటేజ్ కంపెనీని కూలగొట్టాలని చాలా మంది చూశారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భువనేశ్వరి. హెరిటేజ్ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, హెరిటేజ్‌ను ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు నారా భువనేశ్వరి.
ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..
Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..