మేడారం మినీ జాతర ప్రారంభం.. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

|

Feb 24, 2021 | 12:12 PM

తెలంగాణ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. మేడారం మినీ జాతర ప్రారంభం..

మేడారం మినీ జాతర ప్రారంభం.. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌
Follow us on

తెలంగాణ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. మేడారం మినీ జాతర ప్రారంభం సందర్బంగా సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ముందు ములుగు లో గట్టమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పండగలకు గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రజలు సంతోషంగా పండగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవార్లను దర్శించుకునే విధంగా ప్రచారం, రవాణా, ఇతర వసతులు కల్పించారన్నారు.

నేటి నుంచి 27వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తో పాటు మాజీ ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్, స్థానిక నేతలు ఉన్నారు.

Read more:

పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు