గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ హోంమంత్రి.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన మహమూద్‌ అలీ

తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా..

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ హోంమంత్రి.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన మహమూద్‌ అలీ
Follow us
K Sammaiah

|

Updated on: Mar 02, 2021 | 1:01 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మొక్కలు నాటుతూ పర్యావరణ రక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం పథకానికి గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ తోడుగా నిలుస్తుంది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజునాడు మొక్కులు నాటడం ఆనవాయితీగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంమైంది. ఒక్క రోజులో ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 50 దేశాల్లో చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి మరింత విస్తృత గుర్తింపు లభించినట్టయితే

తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహమూద్‌ అలీ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా మలక్ పెట్ అజంపురా లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో హోంమంత్రి మహమ్మద్ అలీ మొక్కలు నాటారు.

అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. జన్మదిన సందర్భంగా ఇతర కార్యక్రమాలు చేపట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మొక్కలు నాటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం చాలా విజయవంతం అయిందని ఈ సందర్భంగా మహమూద్‌ అలీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు ఆజం హలీ ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ,కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి ,తీగల సునరీతా రెడ్డి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మహమూద్ అలీకి మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు:

అంతకు ముందు హోం మంత్రి మహమూద్‌ అలీకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీని జన్మదినోత్సవం సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.

Read more:

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!