పేద ప్రజల కోసం పోరాటం.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి.. నోముల సంతాప తీర్మానం లో మంత్రి జగదీష్ రెడ్డి

|

Mar 16, 2021 | 11:38 AM

జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన నేత నోముల నరసింహ్మయ్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి..

పేద ప్రజల కోసం పోరాటం.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి.. నోముల సంతాప తీర్మానం లో మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy
Follow us on

జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన నేత నోముల నరసింహ్మయ్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేత ఆయన అని ఆయన కొనియాడారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దివంగత నోముల నరసింహ్మయ్య మరణం పై ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణా సాయుధ రైతాంగా పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో రాణించిన ఆయన భూస్వామ్య పెత్తందారీ వర్గాలకు వ్యతిరేఖంగా ప్రశ్నించిన గొంతుక నోములదని ఆయన అభివర్ణించారు. దివంగత నేత సీనియర్ మార్కిస్టు నేత నర్రా రాఘవ రెడ్డి గారి అనుచరుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకున్నారని ఆయన గుర్తు చేశారు. అంతే గాకుండా తెలంగాణా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తాను రాసిన వ్యాసాలపై స్పందిస్తూ సూర్యాపేట లో మొట్టమొదటి సారిగా నోముల నరసింహ్మయ్య కలుసుకున్న సందర్బాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సిపియం నేతగా నాడు తాను రాసిన వ్యాసం పై పార్టీ డిఫెన్స్ లో పడిందని చెబుతూనే ఎన్నటికో ఒక నాడు నేను మీ దారిలో కీ వస్తానంటూ చెప్పిన తీరుగానే రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన 2014 ఎన్నికల నాటికి టి ఆర్ యస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో టి ఆర్ యస్ లోకి వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.అటువంటి నేత నేడు మనమధ్యలో లేక పోవడం దురదృష్టకరమన్నారు.

Read More:

మంచి మనసున్న గవర్నర్‌గా తమిళిసై.. పేద విద్యార్థికి ల్యాప్‌టాప్‌ సాయం.. గవర్నర్‌కు విద్యార్థి కృతజ్ఞతలు

భలా బండలనాగపూర్‌.. ఆభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన కుగ్రామం.. వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు

ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటూ తమాషాలు చేస్తున్నారా..? వైద్యులపై మంత్రి చెడుగుడు.. డాక్టర్ల గుస్సా