వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి విస్తృత పర్యటన. పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకుంటున్న మంత్రి

|

Mar 14, 2021 | 10:11 AM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రరంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా..

వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి విస్తృత పర్యటన. పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకుంటున్న మంత్రి
Errabelli Focus On Election
Follow us on

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రరంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు హక్కు నమోదు చేయించుకున్న పట్టభద్రులు అంతే స్థాయిలో పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

ఇక తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో కష్టపడి ప్రచారం నిర్వహించిన అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు పోలింగ్‌ సరళిపై ఆరా తీస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సరళిని ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగి తెలుసుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లా తో పాటు, పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, నెక్కొండ, వరంగల్ అర్బన్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర, జనగామ జిల్లా కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల, జనగామ తదితర ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తూ పోలింగ్‌ సరళిపై స్థానిక నాయకులతో ఆరా తీస్తున్నారు.

పోలింగ్ బాగా జరిగే విధంగా చూడాలని, ఓటర్ల కు అవసరమైన సూచనలు చేయాలని స్థానిక నేతలను మంత్రి ఆదేశించారు. పలువురు ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను కలిసి తగు సూచనలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. పోలింగ్ ఎలా జరుగుతున్నది? ఓటర్లు సజావుగా ఓట్లు వేస్తున్నారా? వంటి వివరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగి తెలుసుకుంటున్నారు.

వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 5,05,565 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 3,32,634, మహిళలు 1,72,864, థర్డ్‌జండర్‌ 67 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేసుకున్నారని.. దీంతో పోలింగ్‌ శాతం కూడా భారీ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శషాంక్‌ గోయల్‌ చెప్పారు.

 

Read More:

తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్‌.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ​మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లాలో కొండా రాఘవరెడ్డి పర్యటన.. షర్మిల బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో సమీక్ష