మానవత్వం చాటుకున్న మంత్రి.. ప్రమాదవశాత్తు గాయపడిన గిరిజనుడిని సొంత వాహనంలో హాస్పిటల్ కు తరలించిన ఎర్రబెల్లి

|

Feb 16, 2021 | 5:03 PM

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు..

మానవత్వం చాటుకున్న మంత్రి..  ప్రమాదవశాత్తు గాయపడిన గిరిజనుడిని సొంత వాహనంలో హాస్పిటల్ కు తరలించిన ఎర్రబెల్లి
Follow us on

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ గిరిజన యువకుడిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తన భద్రతా సిబ్బందిని, వారి వాహనాన్ని ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, వైద్య చికిత్స కోసం హాస్పిటల్ కి పంపించారు.

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి పర్యటిస్తున్నారు. పాలకుర్తిలో కార్యక్రమం ముగించుకుని, రాయపర్తి కి వెళుతుండగా దారిలో వస్రాం తండా వద్ద రహదారి పై గాయపడిన లాకవత్ చంటి మంత్రికి కనిపించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చంటిని రోడ్డు పక్క పడుకోబెట్టి బంధువులు దీనంగా రోధిస్తూ వాహనం కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఇదే సమయంలో ఆ దారిలో వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారిని గమనించి, వెంటనే తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి, జరిగిన ప్రమాద ఘటన తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి గాయాల పలైనట్లు వారు చెప్పారు. గాయపడిన ఆ యువకుడిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంటనే, తన భద్రతా సిబ్బంది వాహనంలో గాయపడిన ఆ వ్యక్తిని ఎక్కించి, కొంత ఆర్థిక సహాయం అందించారు. తన సిబ్బందిని వారి వెంట పంపించారు. చికిత్స చేయించి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో, ఆ గిరిజనులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపన్నులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే దయన్న దాతృత్వం పట్ల స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

 

Read more:

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి