నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను (అటవీ ఉద్యానవనాలు) ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగోండ మండలం బోథ్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారి ప్రక్కన కుంటాల సోమన్న హరితవనం (అర్బన్ ఫారెస్ట్ ) పార్క్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రతీ అటవీ బ్లాక్ లో జనావాసాలకు దగ్గరగా ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల,పొచ్చెర జలపాతాలకు సమీపంలో ఫారెస్ట్ పార్కును అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎకరం స్థలంలో హరిత హోటల్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిప్రాదనలు రూపొందించామని, అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. వాకింగ్ ట్రాక్, జంగిల్ లాడ్జెస్ (కాటేజీలు), వాట్ టవర్, పగోడాలతో పాటు చిన్న పిల్లలకు ఆట స్థలం, కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేలా ఈ పార్కులో ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
కోటి వృక్షార్చనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిదులతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాలకు చెందిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల రాథోడ్ బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీఎప్ వినోద్ కుమార్ ఎఫ్ డీవో బర్నోబా, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు
Read more:
విశ్వనగరం హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచి భాగ్యనగరం ఎంపికపై మంత్రి కేటీఆర్ హర్షం