ఆదిలాబాద్‌ జిల్లాలో బరితెగించిన విద్యాధికారి.. తప్పతాగి స్కూళ్లో చిందులేసిన ఎంఈవో

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారే కట్టుబాట్లు తప్పుతున్నారు. పట్టపగలు ఫుల్లుగా మందుకొట్టి..

  • K Sammaiah
  • Publish Date - 1:13 pm, Tue, 23 February 21
ఆదిలాబాద్‌ జిల్లాలో బరితెగించిన విద్యాధికారి.. తప్పతాగి స్కూళ్లో చిందులేసిన ఎంఈవో

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారే కట్టుబాట్లు తప్పుతున్నారు. పట్టపగలు ఫుల్లుగా మందుకొట్టి పాఠశాలల్లో పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. తాగి పాఠశాలకు వెళ్లిన టీచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మద్యం తాగి చిందులేస్తున్నారు.

ఏరోజుకారోజు పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన తాజాగా తాజాగా సంచలనం సృష్టిస్తుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో తాగిన మైకంలో ఓ ఎంఈవో చిందులేస్తున్న దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్‌ ఆవరణలో డ్యాన్స్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం, ఇది చాలా హేయమైన చర్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇవి ఎప్పుడో జరిగిన పాత వీడియోలను కావాలనే కొందరు కొత్తగా వైరల్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త వీడియోలైనా.. పాత వీడియోలైనా చేసింది తప్పు తప్పే కదా అని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు డీడీఎఫ్‌ పిర్యాదు చేశారు.

Read more:

చెరువు కొమ్ము తండాలో సందడి చేసిన మంత్రి.. వంట మనిషి పండగలో పాలుపంచుకున్న ఎర్రబెల్లి