నవంబర్‌లోనే ‘మార్చ్’ల హోరు.. టైటిల్స్ అదిరిపోతున్నాయిగా !

|

Nov 09, 2019 | 6:17 PM

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు ఊపునిస్తూ జెఏసీ, రాజకీయ పార్టీలు కలిసి పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ (ఛలో ట్యాంక్‌బండ్) ఇటు ముగిసిందో లేదో అటు ఏపీలో మరో మార్చ్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏపీలో జరనున్నదానికి ఇసుక మార్చ్‌గా వామపక్షాలు నామకరణం చేశాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీలో ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 3వ తేదీన విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ భారీ స్థాయిలో సక్సెస్సయ్యింది. […]

నవంబర్‌లోనే ‘మార్చ్’ల హోరు.. టైటిల్స్ అదిరిపోతున్నాయిగా !
Follow us on

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు ఊపునిస్తూ జెఏసీ, రాజకీయ పార్టీలు కలిసి పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ (ఛలో ట్యాంక్‌బండ్) ఇటు ముగిసిందో లేదో అటు ఏపీలో మరో మార్చ్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏపీలో జరనున్నదానికి ఇసుక మార్చ్‌గా వామపక్షాలు నామకరణం చేశాయి. వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 3వ తేదీన విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ భారీ స్థాయిలో సక్సెస్సయ్యింది. జనసేన అధినేత లాంగ్ మార్చ్ వేదిక నుంచి ఏపీ ప్రభుత్వానికి పలు సవాళ్ళు విసిరారు. వామపక్షాలు, బిజెపి సంఘీభావం అంటూనే దూరంగా వుండి ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు లాంగ్ మార్చ్‌కు హాజరయ్యారు.

క రకంగా చెప్పాలంటే ఒక్క లాంగ్ మార్చ్ కార్యక్రమంతో ఇసుకపై ఆందోళనలో టిడిపిపై పైచేయి సాధించింది జనసేన. దాంతో ఉలిక్కి పడిన టిడిపి నేతలు.. ఇసుక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా.. శనివారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, విపక్షాల ఉమ్మడి ఆందోళనకు పెద్దన్న తామే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమావేశాలకు జనసేన పెద్దగా ప్రాధాన్యతనివ్వనట్లు కనిపిస్తోంది. ఒక్క పోతిన మహేశ్‌ని అఖిలపక్ష సమావేశానికి పంపి ఊరుకున్నారు పవన్ కల్యాణ్.

అయితే.. సమావేశానికి హాజరైన వామపక్షాలు నవంబర్ 12,13 తేదీలలో ఇసుక మార్చ్‌ను నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఆ రెండు రోజుల్లో వామపక్షాల బృందాలు ఇసుక రీచ్‌లకు వెళ్ళి, ఇసుకను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతారని వామపక్షాల నేతలు ప్రకటించారు. అడ్డుకుంటే పోరాటం ఆగేది కాదని సిపిఐ నేత రామకృష్ణ అంటున్నారు.

ఇటు తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్ళేందుకు ఆర్టీసీ జెఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. నవంబర్ 9ని ముహూర్తంగా నిర్ణయించింది. ఆ తర్వాత మిలియన్ మార్చ్ పేరును చలో ట్యాంక్‌బండ్‌గా మార్చారు. అయితే.. అనుకున్న స్థాయిలో కాకపోయినా పోలీసుల నిర్బంధం మధ్య పలు బృందాలుగా ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల శ్రేణులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుని తమ నిరసనని తెలిపారు.

ఇసుక కొరతను తీర్చకపోతే ఉచిత ఇసుక ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది టీడీపీ. ఆత్మహత్య చేసుకున్న వారి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఇసుకను తరలిస్తున్న వైసీపీ నేతల వాహనాల్ని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ.

నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్… నవంబర్ 9న హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్.. తిరిగి నవంబర్ 12, 13 తేదీల్లో ఏపీలో ఇసుక మార్చ్.. సో.. తెలుగు రాష్ట్రాలను నవంబర్‌లోనే ‘మార్చ్’లు హోరెత్తిస్తున్నాయన్నమాట.